గజ్వేల్లో హరీశ్,వెంకటరామిరెడ్డికి నిరసన సెగ

గజ్వేల్లో హరీశ్,వెంకటరామిరెడ్డికి నిరసన సెగ

 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలపై  ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలంటేనే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు వెనకడుగు వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పై ఎంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య తప్పుకుని కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. 

లేటెస్ట్ గా సిద్దిపేట జిల్లా  గజ్వేల్ లో మాజీ మంత్రి హరీశ్ రావుకు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట రామి రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇవాళ ఉదయం గజ్వేల్ లో  బీఆర్ఎస్   పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి  పాల్గొన్నారు.  మీటింగ్ పూర్తయ్యాక బయటకు వస్తుండగా ..  గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని హరీష్ రావును , ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గేటు బయట అడ్డుకున్నారు  లబ్దిదారులు.  గజ్వేల్ ఆర్డిఓ అధికారితో మాట్లాడి డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు హరీశ్ రావు.

 మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి వెంకట రామిరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీచేస్తున్నారు.