ఓటమిని ఒప్పుకొని  సరిదిద్దుకుందాం.. : నిరంజన్ రెడ్డి

ఓటమిని ఒప్పుకొని  సరిదిద్దుకుందాం.. : నిరంజన్ రెడ్డి

కల్వకుర్తి, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నష్టాన్ని పూడ్చుకునేందు  అవకాశం మళ్లీ వచ్చిందని,  పార్లమెంటు ఎన్నికల్లో సరిదిద్దుకుందామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..    బీఆర్ఎస్  ఓడిపోవడానికి  ఎన్నో కారణాలు ఉన్నాయని తెలిపారు.  

ఉద్యోగాల గురించి  నిరుద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కలిగించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ప్రభుత్వం పట్ల నెగిటివ్ ప్రచారం జరిగిందన్నారు.  రైతుబంధు గురించి అపోహలు సృష్టించి ప్రజలను తప్పుతోవ పట్టించారని తెలిపారు.  సమావేశం మధ్యలో కార్యకర్తలు కల్పించుకుని తమ ఆవేదనను  తెలిలిపారు. నాయకులు తమ పదవుల కోసం ఆరాటపడ్డారని,  కార్యకర్తల గురించి పట్టించుకోలేదని ఆవేదన చెందారు.  

బంగారం కుదువ పెట్టి అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం సర్పంచ్లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎంపీపీ మనోహర్​, విజయ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.