తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్ కు లేఖ

తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్ కు లేఖ

మాజీ మంత్రి, సీనియర్ లీడర్  తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.  సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు. బీఆర్ఎస్ లో ఇన్నాళ్లు సహకరించినందుకు  ధన్యవాదములు, పార్టీకి  రాజీనామా సమర్పిస్తున్నారను అని సింగిల్ లైన్ లో లేఖ రాశారు.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన తుమ్మలకు ఇటీవల  కేసీఆర్  హ్యాండిచ్చారు. బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల లిస్టులో తుమ్మల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వకుండా కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న తుమ్మల తన నియోజకవర్గంలోని అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఖచ్చితంగా ఖమ్మం ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మాటతప్పబోనని.. జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని చెప్పారు. 

ALSO READ:  పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలి : వివేక్ వెంకటస్వామి

అయితే గత కొన్ని రోజులుగా తుమ్మల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజీనామా చేసిన తుమ్మల..  సెప్టెంబర్ 16న లేదా 17 సోనియా, రాహుల్ గాంధీతో  భేటీ కానున్నారు. ఇవాళ , రేపు జరిగే  సీడబ్ల్యూసీ సమావేశంలో  తుమ్మల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

 తుమ్మల నాగేశ్వర్ రావు 1985,1994,1999,2009, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,లో బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.