పంచాయతీ ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతోంది : సత్యవతి రాథోడ్

పంచాయతీ ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతోంది : సత్యవతి రాథోడ్
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, వెలుగు : ప్రజావ్యతిరేకత బట్టబయలవుతుందనే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్​పార్టీ హద్దుల్లేని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక బీఆర్ఎస్​ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. ప్రజలు అడిగినా, అడగకున్నా పథకాలు ఇచ్చామని చెప్పారు.  ప్రభుత్వ పనుల్లో పడి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామని వెల్లడించారు. కేసీఆర్​పై ప్రజల్లో సానుకూలత ఉందని, పార్లమెంట్​ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు.

మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ప్రభుత్వంలో ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పారు.  రైతుబంధు అందరికీ వేశామని డిప్యూటీ సీఎం చెప్తే.. సంక్రాంతి తర్వాత ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని వివరించారు.  ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే స్పష్టత మంత్రులకే లేదని విమర్శించారు.