ప్రజా తీర్పును గౌరవిస్తాం : మర్రి జనార్దన్ రెడ్డి

ప్రజా తీర్పును గౌరవిస్తాం : మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్  పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు, క్యాంటీన్  నిరంతరం ఉంటాయని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని పేర్కొన్నారు.

కార్యకర్తలు గొడవలకు పోకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు. డీసీసీబీ డైరెక్టర్  జక్క రఘునందన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, నాగం శశిధర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్  హనుమంతరావు పాల్గొన్నారు.