ఎంపీ టికెట్ వస్తుందనే అక్కసుతో నాపై అబాండాలు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఎంపీ టికెట్ వస్తుందనే అక్కసుతో నాపై అబాండాలు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

దళిత బంధు పేరుతో డబ్బుల వసూళ్ల గురించి వచ్చిన ఆరోపణలపై.. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నందుకే.. తనపై ఇలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తొలిదశ ఉద్యమంలోనే పాల్గొన్నానని.. 2002 లో కేసీఆర్ చిత్తశుద్ధి, వాక్ చాతుర్యంతో చేరానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ఎవరికైనా బాధ కలిగిస్తే మన్నించండని... బీఆర్ఎస్ పార్టీనే దేవాలయం కేసిఆర్ ఒక దేవుడని... టికెట్ విషయంలో కుటుంబ సమస్య తీసుకొచ్చి టికెట్ రాకుండా చేశారన్నారు ముత్తిరెడ్డి. కేసీఆర్ మాటపై గెలిచి.. సీటు త్యాగం చేశానని చెప్పారు. ఇప్పుడు ఎంపీ టికెట్ వస్తుందనే అక్కసుతో నాపై అబాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధుపై డబ్బులు తీసుకొన్నానని... కానీ ఈ స్కీంపై ఎలాంటి స్కాంలు జరగవద్దని ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని వివరించారు.

రూ. 62 లక్షలు తీసుకున్నాన ఆరోపణలల్లో నిజం లేదని.. ఉద్యమ నేపథ్యంలో వంద ఎకరాలు అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టానని తెలిపారు. అది నాకు చాలా సంతృప్తని ఇచ్చిందని...కానీ ఇప్పుడు నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతీసుకొని దళితులకు న్యాయం చేయాలని కోరారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.