
హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బోధన్ మాజీ MLA షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. డిసెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు.. ఓవర్ స్పీడ్ తో కారును ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఢీకొట్టించాడు. యాక్సిడెంట్ టైమ్ లో కారులో ఇద్దరు యువకులతోపాటు ముగ్గురు యువతులు ఉన్నట్లు సీపీ కెమెరాలో రికార్డ్ అయింది.
అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అయినా...అతన్ని తప్పించి మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదైంది. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.
CP ఆదేశాలతో ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ప్రాధమికంగా గుర్తించామంటున్నారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని... అతడి కోసం గాలిస్తున్నామని వివరించారు పోలీసులు. గతంలోనూ సోహెల్ ప్రమాదాలు చేసినట్టు గుర్తించామన్నారు