మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్కు రాజీనామా.. కాంగ్రెస్ లో చేరే ఛాన్స్

మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్కు రాజీనామా.. కాంగ్రెస్ లో చేరే ఛాన్స్

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం(అక్టోబర్ 16) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న.. ఆకుల లలిత త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆకుల లలితకు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.    

2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల లలిత.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సే కోటా నుంచి ఎమ్మెల్యీగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత 2021న తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గా నియమితురాలై.. 2021 డిసెంబర్ 24న ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు.