బీఆర్ఎస్​కు చిన్నప్ప రెడ్డి రాజీనామా

బీఆర్ఎస్​కు చిన్నప్ప రెడ్డి రాజీనామా

హైదరాబాద్, వెలుగు : మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి బీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.  బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ ఆశించగా.. కేసీఆర్ సీటును కంచర్ల క్రిష్ణారెడ్డికి కేటాయించారు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తూ  పార్టీ చీఫ్ కేసీఆర్ కు లేఖ రాశారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డిని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. చిన్నప్పరెడ్డి జాయిన్ అయ్యాక సైదిరెడ్డి ప్లేస్ లో చిన్నప్పరెడ్డికి టికెట్ ఇస్తారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై చిన్నప్పరెడ్డి బీజేపీ రాష్ర్ట నేతలతో చర్చించినట్లు సమాచారం.