మునుగోడుకు సంబంధించి నాకెలాంటి సమాచారం ఇవ్వట్లే

మునుగోడుకు సంబంధించి నాకెలాంటి సమాచారం ఇవ్వట్లే

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు బైపోల్ ప్రచారానికి సంబంధించి టీఆర్ఎస్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రావట్లేదని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.  మాజీ ఎంపీ అయిన తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కి కూడా.. ఎలాంటి సమాచారం అందడం లేదన్నారు. దీనికి స్థానిక జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మునుగోడు అసెంబ్లీ సీటును తాను కోరుకోవడంలో తప్పేంటని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు . సీఎం కేసీఆర్ ఎలాంటి బాధ్యత అప్పగించినా.. పని చేయడానికి సిద్ధమన్నారు . మునుగోడు టికెట్ బీసీలకే ఇవ్వాలని గతంలో బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు.