కమీషన్లు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారు : మాజీ ఎంపీ రవీందర్ నాయక్ 

కమీషన్లు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారు : మాజీ ఎంపీ రవీందర్ నాయక్ 

మహబూబాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ రవీందర్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ  అనని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వందల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కేసీఆర్ ను అడిగితే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. కమీషన్లు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారని ఆరోపించారు.