తరుగు పేరిట వడ్లు కటింగ్‌‌‌‌ చేయొద్దు : మాజీ ఎంపీ వినోద్కుమార్

తరుగు పేరిట వడ్లు కటింగ్‌‌‌‌ చేయొద్దు :  మాజీ ఎంపీ వినోద్కుమార్
  •     మాజీ ఎంపీ వినోద్​కుమార్

గంగాధర, వెలుగు: కొనుగోళ్లలో తరుగు పేరుతో వడ్లు కటింగ్ చేయొద్దని మాజీ ఎంపీ వినోద్​కుమార్ నిర్వాహకులకు సూచించారు. గంగాధర మండలం వెంకంపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి మంగళవారం సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతుందని మండిపడ్డారు. తాలు, తేమ వంటి కారణాలు చూపుతూ బస్తాకు నాలుగైదు కేజీలు కటింగ్​ చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. 

కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్​ మహిపాల్​రావు, బీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు నవీన్​రావు, లీడర్లు కంకణాల విజేందర్​రెడ్డి, వేముల దామోదర్, నాగి శేఖర్, సురేందర్​రెడ్డి
పాల్గొన్నారు.