పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కి మరణశిక్ష

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కి మరణశిక్ష

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కి లాహోర్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 2007 నవంబర్ 3న పాక్‌లో ఎమర్జెన్సీ విధించినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. 2013లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదయింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషరఫ్‌కు మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. పాక్ చరిత్రలో ఒక అధ్యక్షుడికి ఉరి శిక్ష విధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.