థాయిలాండ్కు చేరుకున్న గోటబయ

థాయిలాండ్కు చేరుకున్న గోటబయ

సింగపూర్: శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. గురువారంతో వీసా గడువు ముగిసిపోవడంతో గోటబయ సింగపూర్ నుంచి వదిలారు. గోటబయ రాకను థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ -ఓ -చా ధ్రువీకరించారు. కొన్నిరోజులు దేశంలో ఉండేందుకు గోటబయకు అనుమతిచ్చామని చెప్పారు. తమ దేశంలో రాజకీయ కార్యకలాపాలు జరపకూడదని కండీషన్​ పెట్టినట్లు వివరించారు. ఆందోళనల కారణంగా జులై 13న గోటబయ శ్రీలంక విడిచి మాల్దీవులకు, ఆపై సింగపూర్ కు పారిపోయారు. అక్కడి నుంచే ఆశ్రయం కోసం థాయ్​లాండ్​కు విజ్ఞప్తి చేశారు. దీంతో కొన్నిరోజులు థాయ్​లాండ్​లో ఉండేందుకు గోటబయకు పర్మిషన్​ ఇచ్చినట్లు ప్రధాని ప్రయూత్ ​పేర్కొన్నారు.