
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయన లూథియానాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల ప్రకాష్ సింగ్ బాదల్ లంబి నియోజకవర్గంలో పర్యటించారు. పార్టీ నాయకులతో సహా కార్యకర్తలను కలిశారు. తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం