
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారుతోంది. రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదేక్రమంలో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగుతోంది. యూపీలో బీజేపీ మిత్రపక్ష పార్టీలైన నిషాద్, అప్నాదళ్ కు సీట్లను కేటాయించింది. నిషాద్ పార్టీకి 15 సీట్లు, అప్నాదళ్ కు 18 నుంచి 20 సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. నిషాద్ పార్టీకి మంచి పట్టున్న పూర్వాంచల్, పశ్చిమాంచల్ ప్రాంతాల్లోనే టికెట్స్ కేటాయించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా కొన్ని సీట్లను మార్చాలనుకుంటున్నామని చెప్పారు. ఎన్ని సీట్లు ఇచ్చారన్నది ముఖ్యంకాదని..తమకు గెలుపే ముఖ్యమన్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 12 స్థానాల్లో పోటీ చేయగా..అందులో తొమ్మిది చోట్ల విజయం సాధించారు.
మరిన్ని వార్తల కోసం