గోవా ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

గోవా ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

పనాజీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను 2024 లోక్ సభ ఎలక్షన్స్ కు సెమీ ఫైనల్స్ గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వ్యూహ రచన, ప్రచారంపై దృష్టి సారించాయి. దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా గోవా, పంజాబ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తమ పార్టీ పంజాబ్ సీఎం క్యాండిడేట్ గా భగవంత్ మాన్ ను ప్రకటించారు. తాజాగా ఆప్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు కూడా వెల్లడించారు. అమిత్ పాలేకర్ ను గోవా ఆప్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు. 

గోవాలోని 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీ 39 స్థానాల్లో పోటీకి దిగింది. భారీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు టార్గెట్ గా బరిలోకి దిగుతున్నామని కేజ్రీవాల్ చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

మీ హామీలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు

మేం ఏ పార్టీకి సపోర్ట్ చేయబోం

లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు