బీజేపీలో అపర్ణ చేరికపై అఖిలేష్ స్పందన

V6 Velugu Posted on Jan 19, 2022

లక్నో : అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అపర్ణకు అభినందనలు తెలిపినఆయన.. సమాజ్ వాదీ పార్టీ భావజాలాన్ని ఆమె బీజేపీలో వ్యాప్తి చేస్తుందని అన్నారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇస్తుండటం సంతోషం కలిగిస్తోందని చురకలంటించారు. సమాజ్వాదీ పార్టీ భావజాలన్ని అపర్ణ యాదవ్ ఇతర పార్టీల్లో కూడా వ్యాప్తి చేయాలనుకోవడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని అఖిలేష్ స్పష్టం చేశారు.
ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలైన అపర్ణ యాదవ్ ఈ రోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోడీ, బీజేపీ విధానాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలినైనందునే కమలదళంలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశించినా శిరసావహిస్తాని చెప్పారు. 2017లో అపర్ణ యాదవ్ ఎస్పీ తరఫున పోటీ చేసి బీజేపీ నేత రీటా బహుగుణ చేతిలో ఓటమి పాలయ్యారు. 

ఇవి కూడా చదవండి..

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

మండలాల్లో బలపడితే కాంగ్రెస్దే అధికారం

Tagged ideology, Bjp, Samajwadi Party, National, Akhilesh Yadav, aparna yadav

Latest Videos

Subscribe Now

More News