మండలాల్లో బలపడితే కాంగ్రెస్దే అధికారం

మండలాల్లో బలపడితే కాంగ్రెస్దే అధికారం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలు ప్రాతిపదికగా తీసుకుని పనిచేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరా భవన్ లో మెంబర్షిప్ కో ఆర్టినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. 30లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పీసీసీ ముందుకెళ్తోందన్న రేవంత్ రెడ్డి.. డిజిటల్ మెంబర్షిప్ పై కో ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. 5 మండలాల్లో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ, 35 మండలాల్లో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తామని చెప్పారు. 600 మండలాల్లో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. మండలాల్లో పార్టీ అధ్యక్షులు సరిగా పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని అన్నారు. 

ఇవి కూడా చదవండి..

డీకే అరుణ కుమార్తె ఫిర్యాదుపై స్పందించిన పీవీపీ

అసెంబ్లీ బరిలో అఖిలేష్