
ఓ దేశానికి మాజీ ప్రధాని..దిగ్గజ టెక్ కంపెనీ ఓనర్ అల్లుడు.. ఇప్పుడు అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు అడ్వయిజర్ అయ్యాడు. కంపెనీ డెవలప్ మెంట్ కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. దేశానికి ప్రధానిగా సేవలందించి వ్యక్తి.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, AI ఆంత్రోపిక్ సంస్థలకు పార్ట్ టైమ్ అడ్వయిజర్ గా కంపెనీలను ముందుకు నడిపించనున్నారు.
ఇన్ఫోసిస్నారాయణమూర్తి అల్లుడు..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ఇప్పుడు అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కు సలహదారు అయ్యారు. మైక్రోసాఫ్ట్, AI ఆంత్రోపిక్ సంస్థలకు పార్ట్ టైమ్ సలహదారుగా నియమితులయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత భారత వారసత్వంలో బ్రిటన్ మొదటి ప్రధాన మంత్రి అయిన రిషి సునక్ పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్న సునక్.. తాను అడ్వయిజర్ గా పనిచేసేందుకు యూకే ప్రభుత్వ వాచ్ డాక్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
సునక్ కెరీర్..
జూలైలో బ్యాంకింగ్ ప్రపంచంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్‌లో సీనియర్ అడ్వైజర్‌గా సునక్ పనిచేశారు. అనేక కొత్త నియామకాలు చేశారు. 2000లో వేసవి ఇంటర్న్‌గా పనిచేసిన తర్వాత సునక్ గతంలో గోల్డ్‌మన్ సాచ్స్‌లో విశ్లేషకుడిగా కూడా పనిచేశారు.
45 ఏళ్ల సునక్ 2015లో టోరీ ఎంపీగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నుంచి జూలై 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టోరీలు ఓడిపోయే వరకు బ్రిటన్ మొదటి భారతీయ వారసత్వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా ఎదిగాడు.