బీసీ రిజర్వేషన్ సాధించే దాకా పోరాటం : కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి

బీసీ రిజర్వేషన్ సాధించే దాకా పోరాటం : కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి
  • కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి

భైంసా, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ​ప్రభుత్వం బీసీల వైపు మొగ్గు చూపుతోందని, 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని కేంద్ర  మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. గురువారం భైంసాలోని కమల జిన్నింగ్​ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్​తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీవో 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆశావహులకు కొంత మేర నిరాశ ఏర్పడిందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.

 అసెంబ్లీ తీర్మానంతో పాటు అన్ని పార్టీల సలహాలు, సూచనలతోపాటు, ప్రభుత్వ పరంగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని 42 శాతం బీసీ రిజర్వేషన్​ బిల్లు చేసిందన్నారు. హైకోర్టు స్టే ఇచ్చినందున తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కులగణన చేపట్టి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ముథోల్​ ఆత్మ చైర్మన్​ నర్సారెడ్డి, లీడర్లు కొట్టె హన్మాండ్లు, చంద్రకాంత్ ​యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.