హైదరాబాదులో మరోసారి ఫార్ములా-ఈ రేసింగ్

హైదరాబాదులో మరోసారి ఫార్ములా-ఈ రేసింగ్

ప్రతిష్టాత్మకమైన ఫార్ములా-ఈ రేసింగ్ మరోసారి హైదరాబాద్ లో హల్ చల్ చేయనుంది. తాజాగా ఈ ఛాంపియన్ షిప్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 16 రేసింగ్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. తొలి రేసు 2024 జనవరి 13న జరగనుండగా.. మెక్సికో  ఈ రేస్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక నాలుగో రేస్ హైదరాబాదులో జరగనుంది. ఫిబ్రవరి 10న ఈ రేసు ప్రారంభం కానుంది.  

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ క్రీడాభిమానులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. నిర్వహణాపరమైన కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద రేసింగ్ పోటీలు ఫర్వాలేదనిపించాయి. దేశంలో మొదటిసారి నిర్వహించిన ఈ ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్ లో ఫ్రెంచ్ రేసర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. 

Also Read:ఎర్రకోటలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్

హుస్సేన్ సాగర్ రేసింగ్ సర్క్యూట్ లో ఫార్ములా-ఈ రేసింగ్ కు ముందు నవంబరు 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరపనున్నారు. ఇదే ట్రాక్ పై ఎఫ్4 పోటీలు కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.