
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పీఎస్పరిధిలో కోడి పందాలు ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన సత్యనారాయణ(34), వెంకటరామన్(36), వెంకటేశ్వరరావు(34), రాజు(33) కలిసి ఆదివారం మధ్యాహ్నం శంషీగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో బెట్టింగ్పెట్టి కోడి పందాలు ఆడుతున్నారు. పక్కా సమాచారంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు పందెం కోళ్లతో పాటు రూ. 6,200 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.