రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్

రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్

రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది.  అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి.  ఈ ఘటన అర్థరాత్రి 1:00 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. సబర్మతి నుండి ఆగ్రా వెళుతున్న రైలు  అజ్మీర్‌లోని మదర్‌లోని హోమ్ సిగ్నల్ దగ్గర పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరకి ఎలాంటి గాయపడలేదని  నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్వో శశి కిరణ్ వెల్లడించారు.

 ఈ ఘటన జరిగిన సమయంలో  రైలులో పలువురు ప్రయాణికులు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనతో పలు రైళ్లను దారి మళ్లించడంతో వాటి షెడ్యూల్‌ ఆలస్యంగా మారింది. 

ALSO READ | కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక తెల్లవారుజామున 3:16 గంటలకు రైలు  ఆగ్రాకు బయలుదేరింది. కాగా  ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని కోటాలో భోపాల్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు సంభవించలేదు.