విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిసెంబర్లో ఒక్క రోజు లీవ్తో 4 రోజులు హాలిడేస్ !

విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిసెంబర్లో ఒక్క రోజు లీవ్తో 4 రోజులు హాలిడేస్ !

డిసెంబర్ లో పెరుగుతున్న చలి తీవ్రతతో స్కూళ్లకు వెళ్లేందుకు స్టూడెంట్స్, ఆఫీస్ కు వెళ్లేందుకు ఉద్యోగులు కాస్త ఇబ్బందికి గురవుతుంటారు. ఓ రెండు రోజులు సెలవులు ఉంటే బాగుండు అనుకుంటుంటారు. అలాంటి వారికి రెండు రోజులు కాదు డిసెంబర్ నెలలో మొత్తం ఆరు రోజులుసెలవులు రానున్నాయి. వీటికి అదనంగా ఓ ఆప్షనల్ హాలీడే వచ్చే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ నెలలో మొత్తం వర్కింగ్ డేస్ 25 రోజులు ఉండనున్నాయి.

డిసెంబర్ లో సెలవులు:

  • 07-12-2025 ఆదివారం
  • 13-12-2025 రెండో శనివారం
  • 14-12-2025 ఆదివారం
  • 21-12-2025 ఆదివారం
  • 25-12- 2025 క్రిస్మస్ (గురువారం)
  • 26-12-2025 బాక్సింగ్ డే (ఆప్షనల్ హాలీడే)
  • 27-12 -2025 నాలుగో శనివారం
  • 28-12 -2025 ఆదివారం

ఒక్క లీవ్ తో లాంగ్ వీకెండ్:

డిసెంబర్ నెలాఖరిలో ఒక్క రోజు సెలవుతో వరుసగా నాలుగు రోజులు హాలీడేస్ దొరికే అవకాశం. ఒక్క రోజు లీవ్ తీసుకుంటే లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉండటం చాలా మందికి కలిసొచ్చే అంశం.

డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉన్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసే చాన్స్ వచ్చింది. 25వ తేదీ గురువారం ప్రభుత్వ హాలిడే ఉంది. ఆ తర్వాత రోజు శుక్రవారం బాక్సింగ్ డే ఆప్షనల్ హాలిడేగా తీసుకోవచ్చు. ఇక శనివారం (డిసెంబర్ 27) ఒక్క రోజు లీవ్ తీసుకుంటే ఆదివారం కూడా కలిసొచ్చే అంశం. దీంతో ఒక్క రోజు లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు.

కలిసొచ్చే క్రిస్మస్ సెలవులు:

క్రిస్మస్ పండుగను విదేశాల్లోనే కాదు ఇండియాలోనూ ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు యేసుక్రీస్తును తలచుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తెలంగాణలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. డిసెంబర్ 25న పండగపూట  ప్రభుత్వ హాలిడే ఉంది. 

►ALSO READ | ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్..అర్బన్ ప్రాంతాల్లోనూ వాళ్లకు ఇండ్లు

 తెలంగాణలో క్రిస్మస్ తర్వాతిరోజు డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) కూడా సాధారణ సెలవే. అంటే తెలంగాణ ఉద్యోగులకు రెండ్రోజులు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నారు. ముందురోజు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఐచ్చిక సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం. ఉద్యోగులు కావాలనుకుంటే డిసెంబర్ 24న కూడా వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

ఇక సాధారణ విద్యాసంస్థలకు కూడా క్రిస్మస్ కి రెండ్రోజులు సెలవులు ఉంటుంది... ఈ రెండు వీకెండ్ తో కలిసివస్తున్నాయి కాబట్టి నాల్రోజుల సెలవులుగా మారవచ్చు. కొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25 గురువారం, 26 శుక్రవారం, 27 శనివారం, 28 ఆదివారం నాల్రోజుల సెలవులుండే అవకాశాలున్నాయి. క్రిస్టియన్ స్కూళ్లకు డిసెంబర్ 21 నుండి 28 వరకు 8 రోజులు సెలవులుంటాయి.