
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో నాలుగు ఫుడ్ స్ట్రీట్‌లను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్, కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల శాఖ సెక్ర టరీ మనోజ్ జోషి లెటర్ రాశారు. సంఖ్యా ప రంగా అత్యధికంగా 4, అత్యల్పంగా ఒకటి చొప్పున ఫుడ్ స్ట్రీట్లు పెట్టాలని లేఖలో ప్రతి పాదించారు. ఒక్కో ఫుడ్ స్ట్రీట్‌కు కేంద్రం రూ.కోటి ఆర్థిక సహాయం
అందించనుంది.