ధరలు పెరగడంతో తగ్గిన పాల వినియోగం

ధరలు పెరగడంతో  తగ్గిన పాల వినియోగం

పెరిగిన ధరలతో చాలా మంది పాల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. తాజాగా చేసిన ఓ సర్వేలో ప్రతీ 10 మంది భారతీయ కుటుంబాల్లో నలుగురు పాల వినియోగాన్ని తగ్గించినట్లు తేలింది. దేశంలోని 303 జిల్లాల్లోని పాల వినియోగదారుల్లో  10వేల కంటే ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల ప్రారంభంలో లీటర్ పాల ధర పై రూ. 3 లు పెంచినట్లు అమూల్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.2 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ తెలిపారు. 

పాల ధరలు పెరుగుతూ ఉన్నందున చాలామంది.. బ్రాండ్‭ను మార్చేసి తక్కువ ధర ఉన్న పాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం గత 12 నెలల్లో కొనుగోలు చేసే పాల పరిమాణాన్ని కొందరు తగ్గించుకుంటే.. మరికొందరు పాలను కొనడం పూర్తిగా బంద్ చేశారు. ధరలు ఇకపై పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. సర్వేలో పాల్గొన్న 10 కుటుంబాల్లో 6 మంది అధిక ధరలను చెల్లించి అదే బ్రాండ్ పాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. మిగిలిన వారిలో కొంతమంది అదే బ్రాండ్ లో పాల పరిమాణాన్ని తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే బ్రాండ్ కు మారారు. ఇక 3 శాతం మంది పూర్తిగా పాలు కొనడం మానేసినట్లు సర్వేలో తేలింది.