జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి లో నలుగురి మృతి

V6 Velugu Posted on Jun 12, 2021

జమ్ము కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. సోపోర్ లో  CRPF, కశ్మీర్ పోలీసుల టీంపై టెర్రరిస్టులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని సైనిక ఆస్పత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో CRPF, పోలీసు బలగాలను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు.
కాల్పుల సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే  ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు. అక్కడి మెయిన్ చౌక్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

Tagged terrorists open fire, Four Killed, Sopore Town, Several Injured

Latest Videos

Subscribe Now

More News