
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కెవి. పల్లి మండలం మహల్ క్రాస్ రోడ్డు దగ్గర కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.