- 14 మందికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మరణించారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఢిల్లీలోని కరోబాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ భవనం కుప్పకూలిందని బాపా నగర్ ప్రాంతం నుంచి అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్టు తెలిపారు. గాయాలపాలైన 14 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం ఆతిశి విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు.