ఇన్ స్టాగ్రామ్ లో అబ్బాయిల ఫోటోలు నచ్చితే గ్యాంగ్ రేప్

ఇన్ స్టాగ్రామ్ లో అబ్బాయిల ఫోటోలు నచ్చితే గ్యాంగ్ రేప్

 ♦  20ఏళ్ల యువకుడిపై కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

 ♦  ఇన్ స్టాగ్రామ్ ఫోటోలతో యువకుడిపై దారుణం

 ♦  నలుగురు దుండగుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మేం మీ ఫ్యాన్స్ అంటూ ఓ యువకుడిని నలుగురు దొంగలు గ్యాంగ్ రేప్ చేశారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా..పోలీసుల విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూశాయి.

ఫోటోలు దిగి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త అంటూ ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ముంబై శివార్లలో నివసించే ఓ యువకుడికి (20) ఫోటోలు దిగి అదే పనిగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేయడం అలవాటు. ఆ అలవాటే యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది.

ముంబైలో ఉండే నలుగురు ముఠా సభ్యులు ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు చూసి, అందంగా ఉన్న యువకుల్ని గుర్తించి, ఫోటోల ద్వారా యువకుల్ని ట్రాప్ చేసి వారిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు.

ఆదివారం ఈ గ్యాంగ్ ముంబై శివారు ప్రాంతానికి చెందిన యువకుడు ఇన్ స్టాగ్రామ్ ఫోటోల్ని గుర్తించారు.మేం మీ అభిమానులం. నువ్వు మాతో బైక్ రైడింగ్ చేస్తావా అంటూ అగంతకులు యువకుడికి మాయమాటలు చెప్పారు.

అసలే నా ఫ్యాన్స్ , పైగా రైడింగ్ చేయాలని కోరుకుంటున్నారు. వారితో రైడింగ్ చేస్తే తప్పేంటని అనుకున్న బాధితుడు వారితో కలిసి బైక్ రైడింగ్ చేశాడు. 20నిమిషాల పాటు బైక్ రైడింగ్ చేసిన ఆ ఐదుగురు ముంబై ఎయిర్ పోర్ట్ సమీపంలో ఓ హోటల్ కు చేరుకున్నారు.

అక్కడే నలుగురు నిందితులు బాధితుణ్ని బలవంతంగా కారెక్కించారు. నగరం అంతా తిప్పుతూ కారులోనే ముడు గంటలపాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ దారుణంతో బాధితుడు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఓ ప్రాంతంలో పడేసి దుండగులు పరారయ్యారు. 

సోమవారం ఉదయం ఆపస్మారక స్థితి నుంచి భయటకు రావడంతో బాధితుడు వీబీ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో నలుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువకుడు మైనర్ కావడంతో ఇంటికి పంపించినట్లు మిగిలిన ముగ్గురిపై ఎఫ్ ఐర్ నమోదు చేసినట్లు,కోర్ట్ కు హాజరుపరుస్తామని వీబీనగర్ పోలీస్ అధికారి మధురి పోక్లే వెల్లడించారు.