ఇందిరమ్మ ఇండ్లను అక్రమంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేశారని .. నలుగురు విలేజ్‌‌‌‌ సెక్రటరీలు సస్పెన్షన్‌‌‌‌

ఇందిరమ్మ ఇండ్లను అక్రమంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేశారని .. నలుగురు విలేజ్‌‌‌‌ సెక్రటరీలు సస్పెన్షన్‌‌‌‌

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ టౌన్‌‌‌‌, వెలుగు : నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లాలో నలుగురు గ్రామ పంచాయతీ సెక్రటరీలపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. బిజినేపల్లి మండలం గంగారం సెక్రటరీ నరేందర్ రెడ్డి, అల్లిపూర్‌‌‌‌ సెక్రటరీ రజిని, బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి సెక్రటరీ ఎం.బాలరాజు, ఊరుకొండ మండలం గుడిగానిపల్లి సెక్రటరీ దండు రామచంద్రయ్య ఇందిరమ్మ ఇండ్లను అక్రమంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేశారని, పాత ఫోటోలను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశారని ఫిర్యాదులు అందాయి. 

డీపీవో రాములు ఎంక్వైరీ చేయగా.. అక్రమాలు నిజమేనని తేలడంతో కలెక్టర్‌‌‌‌కు రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. దీంతో నలుగురు విలేజ్‌‌‌‌ సెక్రటరీలను సస్పెండ్‌‌‌‌ చేస్తూ కలెక్టర్‌‌‌‌ బాదావత్‌‌‌‌ సంతోష్‌‌‌‌ బుధవారం ఆర్డర్స్‌‌‌‌ చేశారు.