
కర్ణాటకలో హంపి ఓ చారిత్రక గ్రామం. విజయనగర రాజులు పరిపాలించిన కాలం నాటి చారిత్రక కట్టడాలు ఈ గ్రామంలో ఉన్నాయి. దీనిని చారిత్రక వారసత్వ సంపద అపారంగా ఉన్న నగరంగా ప్రపంచం ఏనాడో గుర్తించింది. ఇక్కడికి పర్యాటకులు కూడా వందలమంది రోజూ వస్తుంటారు. అలాంటి హంపీలో కొందరు ఆకతాయిలకు తగిన శాస్తి చేశారు అధికారులు.
వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఖ్యాతిగాంచిన హంపీలోని ఓ గుడిలో ఓ స్తంభాన్ని నలుగురు ఆకతాయి యువకులు గత జనవరిలో పడగొట్టారు. దీనిపై కేసు నమోదైంది. పోలీసులు ఆ ఆకతాయిలను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఓ కోర్టు వారికి ఓ శిక్ష వేసింది. పడగొట్టిన ఆ యువకుల సహాయంతోనే ఆ పిల్లర్ ను నిలబెట్టాలని పోలీసులు, అధికారులకు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం… అధికారులు.. ఆ నలుగురు యువకులను గుడికి తీసుకెళ్లి.. వాళ్ల సహాయంతోనే ఆ స్తంభాన్ని నిలబెట్టించారు. చేసిన తప్పుకు యువకులు క్షమాపణ కోరారు. వారి నుంచి తలో రూ.70వేల జరిమానాను కోర్టు సూచనలతో వసూలు చేశారు అధికారులు.
చేసిన తప్పును తెల్సుకుని మళ్లీ అలా చేయకుండా ఉండేందుకే ఇలాంటి శిక్ష విధించిందని అధికారులు చెప్పారు. దీనిని చూసైనా ఇంకెవరు ఇలాంటి ఆకతాయి పనులు మరెవరూ చేయకుండా ఉంటారని పోలీసులు చెప్పారు.