
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేయగా, ‘బుజ్జి మేక’ అంటూ సాగే ఫోర్త్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్.. కాలభైరవ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఎవడు రాసిండంటా నుదిటిపైనే రాత.. తోలు బొమ్మల్లా ఆడుతూనే ఉందమా.. చదువు నేర్చుకుందాం.. మార్చుకుందాం.. మనకు మనమే తలరాతలు రాసేలాగా..’ అంటూ సాగిన పాట ఇన్‌స్పైరింగ్‌గా ఉంది.
‘పడిపోకుండా నడకొస్తుందా.. నెర్వకపోతే తెలివొస్తుందా.. పశువు..మనిషి తేడా లేదా’ అంటూ రాసిన లిరిక్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఇందులో యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల డీ గ్లామర్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.