
హైదరాబాద్, వెలుగు: ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్, ఓనర్‌షిప్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రాక్స్‌పేస్ మొబైల్ యాప్‌ను హైదరాబాద్‌లోని టీ–-హబ్ లో ప్రారంభించింది. ఇది హాలిడే హోమ్‌లు, కమర్షియల్ ప్రాపర్టీలతో సహా అనేక రకాల ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లలో పాక్షిక పెట్టుబడులకు(ఫ్రాక్షనల్ఇన్వెస్ట్మెంట్), పాక్షిక యాజమాన్యానికి అవకాశం ఇస్తుంది. గోవా, హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రీమియం ఆస్తుల పోర్ట్‌ఫోలియోల్లో దీని ద్వారా కొంతమొత్తం పెట్టుబడులు పెట్టవచ్చు. ఫలితంగా ఇన్వెస్టర్లు ఏడాదికి పది శాతం వరకు అద్దె పొందవచ్చని ఫ్రాక్స్‌పేస్ తెలిపింది.