యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో పర్మనెంట్​గా ఇండియాకు చోటివ్వాలె: ఫ్రాన్స్​

యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో పర్మనెంట్​గా ఇండియాకు చోటివ్వాలె: ఫ్రాన్స్​

యునైటెడ్ నేషన్స్: యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని ఫ్రాన్స్ మద్దతు పలికింది. గ్లోబల్ పవర్స్ గా ఎదుగుతున్న దేశాలతో సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించాలని కోరింది. జర్మనీ, బ్రెజిల్, జపాన్​లకూ శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు మద్దతు తెలిపింది. సెక్యూరిటీ కౌన్సిల్​లో రిఫార్మ్స్ పై శుక్రవారం జరిగిన జనరల్ అసెంబ్లీ మీటింగ్​లో ఫ్రాన్స్ ప్రతినిధి నథాలీ బ్రాడ్ హర్ట్స్​ మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సెక్యూరిటీ కౌన్సిల్​ను విస్తరించాలని ఆమె అన్నారు. ‘‘ప్రస్తుతం సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలు పర్మనెంట్ మెంబర్లుగా, 10 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్లుగా ఉన్నాయి. పర్మనెంట్, నాన్ పర్మనెంట్ సభ్యత్వాలను 25 వరకూ పెంచాల్సిన అవసరం ఉంది” అని ఆమె చెప్పారు. సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ విషయంపైనా రిఫార్మ్స్ తేవాలన్నారు.

ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కూడా పెంచాలన్నారు. ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని గురువారం నాటి సమావేశంలో బ్రిటన్ కూడా మద్దతు పలికింది. అమెరికా, రష్యా సైతం ఇదివరకే ఆమోదం తెలిపాయి. సెక్యూరిటీ కౌన్సిల్లోని ఐదు దేశాల్లో నాలుగు దేశాలు ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ పై ఓకే చెప్పగా.. ఒక్క చైనా మాత్రమే స్పందించాల్సి ఉంది. వచ్చే నెల జరగనున్న సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత ఇండియా రెండేండ్ల పదవీకాలం పూర్తి కానుంది.