వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్​ ఇప్పిస్తామని మోసం

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్​ ఇప్పిస్తామని మోసం

శివ్వంపేట, వెలుగు : ఇంట్లో కూర్చుని పనిచేసే జాబ్​ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. గ్రామనికి చెందిన గోత్రాల లక్ష్మీనరసయ్య ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేసి పార్ట్ టైం జాబ్  ఉందని, ఇంట్లోనే కూర్చుని పెన్నులు, పెన్సిల్లు ప్యాక్ చేయాలని చెప్పారు. ఆయన కూతురు ఇంట్లోనే కూర్చుని చేసే పని కదా అని ఆసక్తి కనబరిచింది. 

సదరు వ్యక్తులు జాబ్ లో జాయిన్ కావడానికి ఫస్ట్ రూ.650  గూగుల్ పే చేయమని చెప్పడంతో చేశారు. తర్వాత ఐడీ కార్డ్ కోసం రూ.2 వేలు పే చేయాలని చెప్పడంతో అవి కూడా పే చేశారు. తర్వాత మళ్లీ కాల్ చేసి రూ.4 వేలు పే చేస్తే  మెటీరియల్ తో పాటు, చెల్లించిన డబ్బులు మొత్తం తిరిగి వస్తాయని చెప్పడంతో మరో రూ.4 వేలు పే చేశారు. ఇలా మొత్తం రూ.6,500 పే చేసిన తరువాత సదరు వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి మరొక రూ.5 వేలు వేయండి అవి వేస్తేనే మీకు మెటీరియల్ వస్తుందని చెప్పడంతో అది సైబర్​ నేరగాళ్ల పని అని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు 

చేశారు.