ఆన్ లైన్ లో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ అమ్ముతామంటూ మోసం

ఆన్ లైన్ లో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ అమ్ముతామంటూ మోసం
  • సైబర్ క్రైమ్ స్టేషన్ లో బాధితుడి ఫిర్యాదు.. 
  • ఢిల్లీలో ఉన్న నిందితుడ్ని పట్టుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్: ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ అమ్ముతామంటూ ఆన్ లైన్ లో ప్రకటన చూసి డబ్బులు చెల్లించిన తర్వాత మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయడంతో మోసపోయిన ఉదంతం హైదరాబాద్ లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి బ్యాంకు అకౌంట్.. ఫోన్ నెంబర్ ఆధారంగా వివరాలు సంపాదించి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 7న ఢిల్లీలో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. 
ఎలా జరిగిందంటే..
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడకు చెందిన సిద్ధార్థ అనే వ్యక్తి  ఆన్ లైన్ లో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ అమ్ముతామంటూ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించారు. గత రెండు నెలల క్రితం ఢిల్లీ కి చెందిన బలరాం కుమార్ ఝా తాను ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ విక్రయిస్తానంటూ ఆన్లైన్ లో పోస్ట్ చేయడం గమనించిన సిద్దార్థ్ తనకు రెండు ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ కావాలంటూ బలరాం ను ఆన్ లైన్ లో సంప్రదించాడు. నిందితుడు మొదట అమౌంట్ ను తన అకౌంట్ కు  ట్రాన్స్ఫర్ చేస్తే  ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ ను డెలివరీ చేస్తానాని సిద్దార్థ్ ను న్మమించాడు. దీనితో 2 లక్షల 85 వేలు డబ్బును నిందితుడు బలరాం అకౌంట్ కు సిద్ధార్థ్  ట్రన్స్ఫర్ చేశారు. నగదు ట్రాన్స్ ఫర్ అయిన తరువాత బలరాం స్పందించకపోవడంతో మోసపోయాయని గ్రహించిన సిద్దార్థ్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టి ఈ నెల 7న ఢిల్లీ లో బలరాం ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి  మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.