వాట్సాప్ ను టార్గెట్ చేసిన మస్క్ - ఎక్స్ ( ట్విట్టర్ )లో ఫ్రీ ఆడియో, వీడియో కాల్స్..!

వాట్సాప్ ను టార్గెట్ చేసిన మస్క్ - ఎక్స్ ( ట్విట్టర్ )లో ఫ్రీ ఆడియో, వీడియో కాల్స్..!

ఎక్స్ ( ట్విట్టర్ ) అధినేత ఎలాన్ మస్క్ రోజుకో షాకింగ్ న్యూస్ తో మన ముందుకొస్తున్నారు. మొన్న ఎక్స్ మెయిల్ తెస్తానంటూ గూగుల్ కి షాకిచ్చిన మస్క్ ఇప్పుడు లీడింగ్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కే ఎసరు పెట్టాడు. ఎక్స్ లో ఫ్రీ ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నాడు. ఈ అప్డేట్ గురించి ఎక్స్ సంస్థ ఇంజినీర్ ఎన్రిక్ బర్రగాన్ ఓ పోస్ట్ లో తెలిపాడు.

ఈ అప్డేట్ గనక అందుబాటులోకి వస్తే వాట్సాప్ కి గట్టి పోటీ వచ్చి పడ్డట్టే అని చెప్పాలి. ఎటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఈ అప్డేట్ ని అందరూ వినియోగించుకొనే అవకాశం ఉండటంతో వాట్సాప్ ప్రత్యామ్నాయంగా ఎదిగే ఛాన్స్ ఉంది. అయితే వాట్సాప్ లో లాగా ఎక్స్ లో అందరికీ కాల్ చేసే సదుపాయం ఉండదు. మనం ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ మన ఫోన్లో ఉండాలి లేదా ట్విట్టర్లో ఇద్దరు ఫాలో అయ్యి ఒకసారైనా చాట్ చేసి ఉండాలి.

ఎక్స్ లో ఈ ఫీచర్ చాలా కాలం కిందట నుండి ఉంది కానీ, కేవలం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్న IOS యూజర్స్ కి, ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రీమియం అవసరం లేకుండా అందరికీ ఈ ఫీచర్ ని అందుబాటులోకి తేవటం హాట్ టాపిక్ గా మారింది. అయితే వాట్సాప్ కి పోటీగా గతంలో కూడాచాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి క్లిక్ అవ్వలేకపోయాయి. మరి, ఎక్స్ కూడా వాటి జాబితాలో చేరుతుందా లేక వాట్సాప్ కి పోటీ ఇస్తుందా అనేది వేచి చూడాలి.