టీకా వేసుకుంటే బీర్ ఫ్రీ

V6 Velugu Posted on May 01, 2021

వాషింగ్టన్: అమెరికాలో అదిరిపోయే ఆఫర్లు.. బంపర్ ప్రైజులు. అదేదో మాల్స్ లోనో, షాపింగ్ సెంటర్లలోనో అనుకునేరు.. వ్యాక్సిన్ సెంటర్లలో. అదేంటి అనుకుంటున్నారా? అవును మరి.. అమెరికాలో టీకా వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు(రూ.36,982) ఇస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా, చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి.   

ఇవీ ఆఫర్లు.. 

టీకా వేసుకున్నోళ్లకు కొన్ని బ్రూవరీల్లో ఫ్రీగా బీర్ ఇస్తున్నారు. డెట్రాయిట్ నగరంలో ఎవరినైనా వ్యాక్సిన్ సెంటర్ దగ్గరికి తీసుకొస్తే 50 డాలర్లు(రూ.3,698) ఇస్తున్నారు. సెలూన్ షాపులలో ఫ్రీ సర్వీస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెస్ట్ వర్జీనియాలో టీకా వేసుకుంటే 100 డాలర్లు(రూ.7,396) విలువైన సేవింగ్ బాండ్స్ ఇస్తున్నారు. అలాస్కాలో నార్టన్ సౌండ్ హెల్త్ కార్ప్ ప్రైజులతో పాటు ఎయిర్ లైన్ టికెట్లు ఇస్తోంది. సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు గానీ, పెట్రోల్ గానీ ఉచితమని చెప్తోంది. 

Tagged washington, us, Covid-19 vaccine, Free Beer, Incentives

Latest Videos

Subscribe Now

More News