రాఖీ పండుగ రోజు.. ఉచిత బస్సు సర్వీసులు.. నో టికెట్

రాఖీ పండుగ రోజు.. ఉచిత బస్సు సర్వీసులు.. నో టికెట్

సోదరీ, సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రక్షా బంధన్ సందర్భంగా మహిళల కోసం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రక్షా బంధన్ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈసారి ఆగస్టు 30, 31 తేదీల్లో రక్షా బంధన్‌ శుభ ముహూర్తాన్ని ప్రకటించిన సందర్భంగా 24 గంటల పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేసింది.

రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 30 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 31 అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ బెనర్జీ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. గత సంవత్సరాల మాదిరిగానే రక్షా బంధన్ సందర్భంగా ఈసారీ ఎస్‌పీవీ ద్వారా నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కళ్యాణ్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేశారు.

తాజా ప్రకటన ప్రకారం రాజధాని లక్నో, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. దీంతో పాటు వారణాసి, ఘజియాబాద్, అలీగఢ్‌లోని మహిళలు సైతం రక్షా బంధన్ రోజున సిటీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు.  మొరాదాబాద్, ఝాన్సీ, బరేలీ, గోరఖ్‌పూర్, షాజహాన్‌పూర్, ఆగ్రా, మధుర-బృందావన్‌లోని సిటీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. ఈ జిల్లాలన్నింటిలో ఆగస్టు 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు రక్షా బంధన్ సందర్భంగా ఎస్‌పీవీల ద్వారా నడపబడుతున్న సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.