తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్​లో ఫ్రీ కోచింగ్​  

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్​లో ఫ్రీ కోచింగ్​  

తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రం ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని 12 ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మార్చి 18 నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు అందించనున్నారు. అర్హులైన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు మార్చి 6వ తేదీ వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలి. ఎంట్రెన్స్​ టెస్టులో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల  ఎంపిక ఉంటుంది. ఉచిత స్టడీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమకూరుస్తారు.

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సీ స్టడీ సర్కిల్ బ్రాంచులు : ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు.

సీట్లు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ప్రతి జిల్లాశాఖకు 100 సీట్ల చొప్పున ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 75శాతం, ఎస్టీలకు శాతం, బీసీ/ మైనారిటీలకు 15 శాతం సీట్లు కేటాయించారు.

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి. ట్రైనింగ్​ 5 నెలల సమయం ఉంటుంది. 

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మార్చి 10న నిర్వహిస్తారు. కోచింగ్​ మార్చి 18 నుంచి ఆగస్టు 17 వరకు ఉంటుంది. వివరాలకు  040-–23546552 ఫోన్​ నంబర్​కు సంప్రదించాలి.