జనవరి 22న ఉచిత డెలివరీలు.. ప్రైవేటు హాస్పిటల్ బంపరాఫర్

జనవరి 22న  ఉచిత డెలివరీలు..  ప్రైవేటు  హాస్పిటల్ బంపరాఫర్

అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుండటంతో కర్నాటక విజయపుర జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ హాస్పిటల్ లో ఈ నెల 18 నుంచి  22వ తేదీ వరకు ఉచితంగా డెలివరీలు చేస్తామని జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలిపింది. ఈ ఆసుపత్రిని శ్రీ సిద్ధేశ్వర్ లోక కల్యాణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.  హాస్పిటల్ తీసుకున్న నిర్ణయాన్ని విజయపుర ఎమ్మెల్యే బసన్న గౌడ పాటిల్ యత్నాల్ ప్రశంసించారు.