ఖానాపూర్ మండలంలో ఉచిత దంత వైద్య శిబిరం

ఖానాపూర్ మండలంలో ఉచిత దంత వైద్య శిబిరం

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం రంగాపేటలో ఎస్ఆర్ఆర్ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులతోపాటు ప్రభుత్వ స్కూల్​స్టూడెంట్లకు స్క్రీనింగ్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు నితీశ్ రాజా, యోగిత మహాజన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దంత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

బ్రషింగ్ విధానంపై అవగాహన కల్పించారు. డాక్టర్లు అఖిల్ కుమార్, భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ సాగిపెద్ద లక్ష్మణ్ రావు, వాసవి క్లబ్ వైస్ గవర్నర్  జితేందర్ మహాజన్, గ్రామ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, నాయకులు కటకం శ్రీని వాస్, లింగారెడ్డి, మహాజన్ జలంధర్ గుప్తా, వెంకటేశ్ ​తదితరులు పాల్గొన్నారు.