14 ఏండ్లలోపు పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఫ్రీ హెయిర్‌కట్

14 ఏండ్లలోపు పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఫ్రీ హెయిర్‌కట్

కరోనావైరస్ కారణంగా చాలామంది బార్బర్ షాపుకి వెళ్లి హెయిర్ కట్ చేయించుకోవడానికి భయపడుతున్నారు. మరికొంతమంది కరోనా వల్ల ఉపాధి లేక.. డబ్బులు ఖర్చు చేయడం ఎందుకుని కటింగ్ చేయించుకోవడం లేదు. అలా డబ్బు లేక కటింగ్ చేయించుకోని పిల్లల కోసం ఫ్రీగా హెయిర్ కట్ చేస్తున్నాడు కేరళకు చెందిన బార్బర్.

కొచ్చిలోని కత్రికడవుకు చెందిన గోపి అనే వ్యక్తి బార్బర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు మూడు బార్బర్ షాపులున్నాయి. కరోనా వల్ల చాలామంది పిల్లలు కటింగ్ చేయించుకోవడంలేదని… అలాగే సీనియర్ సిటిజన్లు కూడా డబ్బుకు కష్టమై బార్బర్ షాపుకు రావడంలేదని ఆయన భావించాడు. దాంతో 14 సంవత్సరాల వయసులోపలి పిల్లలకు మరియు సీనియర్ సిటిజన్లకు ఫ్రీగా హెయిర్ కట్ చేస్తామని ఆఫర్ పెట్టాడు. దాంతో పిల్లలు, వృద్ధులు షాపు ముందు క్యూ కట్టి మరీ ఫ్రీగా కటింగ్ చేయించుకుంటున్నారు.

‘నాకు మూడు బార్బర్ షాపులు ఉన్నాయి. వాటిల్లో ఒక షాపులో ఫ్రీ హెయిర్‌కట్ చేస్తున్నాం. 14 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉన్న పిల్లలకు మరియు వృద్ధులకు మేం ఉచితంగా హెయిర్‌కట్ చేస్తాం. కరోనా వల్ల ప్రజల దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. కరోనా తీవ్రత ముగిసేవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సాధారణ హెయిర్‌కట్ కోసం రూ. 100 తీసుకుంటాం. అంత డబ్బు చెల్లించలేని వారికి మేం ఫ్రీగా చేస్తాం ’అని బార్బర్ షాప్ యజమాని గోపి తెలిపాడు.

కరోనావైరస్ వల్ల ఏప్రిల్ మరియు మే నెలలో బార్బర్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో లాక్డౌన్ నిబంధనలను సడలించిన తరువాత రాష్ట్రంలో బార్బర్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు ఓపెన్ అయ్యాయి.

For More News..

రేప్ చేసిన వాళ్లకు కొత్త శిక్షను సూచించిన పాక్ ప్రధాని

అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్

తెలంగాణలో మరో 2,058 కరోనా కేసులు