కరీంనగర్ టౌన్, వెలుగు: వరల్డ్ పైల్స్ డే సందర్భంగా గురువారం సిటీలోని పైల్స్ అండ్ మోర్ క్లినిక్ హాస్పిటల్‌లో ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు జనరల్ సర్జన్, ప్రాక్టాలజిస్ట్ డాక్టర్ తాటిపాముల సురేశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపులో పైల్స్‌పై అవగాహనతోపాటు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు పైల్స్‌పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఫ్రీ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
