నస్పూర్ లో అక్టోబర్ 13న హోమియోపతి వైద్య శిబిరం

నస్పూర్ లో అక్టోబర్ 13న హోమియోపతి వైద్య శిబిరం

నస్పూర్, వెలుగు : జాతీయ ఆయుష్ పథకంలో భాగంగా ఈనెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో హోమియోపతి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆయుష్ శాఖ ఇన్​చార్జి డాక్టర్ సీహెచ్ స్పందన ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.