పేదలకు ఉచితంగా న్యాయ సేవ: హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద

పేదలకు ఉచితంగా న్యాయ సేవ: హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద

వనపర్తి, గద్వాల, వెలుగు: న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నామని హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద చెప్పారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టులో మహిళా న్యాయవాదుల వసతుల గది, కోర్టు ఆవరణలో నిర్మించిన సీసీ రోడ్డు , న్యాయ సేవల హెల్ప్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో మదన్మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, మోతీలాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ లాంటి వారు న్యాయవాద వృత్తి నుంచి చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారే ఎక్కువగా పాలన కొనసాగించారన్నారు.  దేశ తొలి ప్రధాని కూడా న్యాయ శాస్త్రం అభ్యసించిన వారేనని గుర్తుచేశారు.  ప్రస్తుతం చట్టసభల్లోనూ  న్యాయ కోవిదులే ఎక్కువగా ఉన్నారన్నారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఎంతో విలువైందని, సాధ్యమైనంత ఎక్కువమందికి న్యాయ సేవలు అందించాలని సూచించారు.  రాజీమార్గమే అత్యుత్తమ పరిష్కార మార్గమని,  కక్షిదాదారులు లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వినియోగించుకొనేలా చూడాలన్నారు.  

కేసుల సంఖ్య పెరగడంతోనే జాప్యం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ కేసులు సంఖ్య పెరగడం , సరిపడా జడ్జిలు లేకపోవడంతోనే కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు.  న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసుల సత్వర పరిష్కారానికి తమ వంతు బాధ్యత వహించాలని సూచించారు.  తాను వనపర్తి జిల్లా వాడినైనందుకు సంతోషంగా ఉందని, కోర్టులో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.   జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుజీబ్ అహ్మద్ ఖాన్, జడ్జిలు రజిని, రవికుమార్, శిరీష, కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్,  అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ , కార్యదర్శి విజయభాస్కర్ పాల్గొన్నారు.

గద్వాలలో లైబ్రరీ ప్రారంభం

గద్వాల కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంతో పాటు లైబ్రరీని శనివారం హైకోర్టు జడ్జిలు జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ నాగార్జున ప్రారంభించారు.  అంతకుముందు వీరికి జిల్లా జడ్జి కనకదుర్గ, జడ్జిలు కవిత, అనిరోజ్, ప్రభాకర్, గాయత్రి,  కలెక్టర్ వల్లూరు క్రాంతి స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారు మాట్లాడుతూ న్యాయవ్యాదులు కేసుల సత్వర పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు.  కలెక్టర్ మాట్లాడుతూ  కోర్టు ఆఫీసుల కోసం 100 ఎకరాలను కేటాయించామని చెప్పారు.  ఐడీఓసీ ఆఫీసు ప్రారంభమయ్యాక  కోర్టు భవనాల నిర్మాణాలను చేపడుతామని తెలిపారు.