ములుగు, వెలుగు : లేబర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ములుగులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ములుగులోని గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో లేబర్ కార్డు ఉన్న వారికి సమాచారం అందించి పలురకాల వైద్యపరీక్షలు చేశారు.
బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ప్రత్యేకంగా చేపట్టిన మూడు వైద్యశిబిరాల్లో సుమారు 420మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యశిబిరం ఇన్చార్జి పవన్ తెలిపారు.