
టెక్నికల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఐఐటీ, ఐఐఎస్సీలు సహా పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ఫ్రీగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి.
ఇస్రో: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ద్వారా ఇస్రో మూడు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. టెక్నికల్ స్టూడెంట్స్‌తోపాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సులకు అర్హులు. ‘ఈ క్లాస్’ పోర్టల్ ద్వారా 70 శాతం సెషన్స్ కంప్లీట్ చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు; కోర్సుల షెడ్యూల్: వెబ్ జీఐఎస్ టెక్నాలజీ–జూన్ 21 నుంచి జులై 2; ఎర్త్ అబ్జర్వేషన్ ఫర్ కార్బన్ సైకిల్ స్టడీస్–జూన్ 21 నుంచి 25; మిషన్ లెర్నింగ్ టు డీప్ లెర్నింగ్–జులై 5 నుంచి జులై 9; కోర్సుల ప్రాసెస్: అభ్యర్థులు www.eclass.iirs.gov.in ద్వారా క్లాసెస్‌కు అటెండ్ కావొచ్చు.
ఐఐఎస్సీ బెంగళూరు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కోసం ఐఐఎస్సీ బెంగళూ రు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై 8 వారాల ఫ్రీ ఆన్లైన్ కోర్స్ అందిస్తోంది. కోర్సు జులై 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అభ్యర్థులు NPTEL వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్ కావాలంటే రూ.1000 ఫీజు చెల్లించి ఐఐఎం రోహ్తక్ సెప్టెంబర్ 26న నిర్వహించే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
ఐఐటీ ఖరగ్‌పూర్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్‌పూర్ మిషన్ లెర్నింగ్ మీద 8 వారాల ఫ్రీ ఆన్లైన్ కోర్సు అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్, ఏఐ, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, రోబోటిక్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. స్వయం ఎన్‌పీటీఎల్ ప్లాట్‌ఫాం ద్వారా కోర్సులో జాయిన్ కావొచ్చు. జులై 26 నుంచి 17 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ కావాల్సిన స్టూడెంట్స్ సెప్టెంబర్ 26న జరిగే ఎగ్జామ్ రాయాలి.
అమెజాన్ ఎంఐ సమ్మర్ స్కూల్: టెక్నికల్ స్టూడెంట్స్‌ను ఇండస్ట్రీ అవసరాలకు సిద్ధం చేసేలా అమెజాన్ ఇండియా జూన్ 13న ‘మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్’ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, నిట్‌లలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనుంది. అభ్యర్థులు amazonmlsummerschoolindia.splashthat.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.